నాని 'V' ట్రైలర్ రిలీజ్.. అంచనాలు తగ్గట్టుగానే..!

నాచురల్ స్టార్ నాని, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబోలో సూపర్ బజ్ తో వస్తున్న సినిమా వి. కొన్నాళ్ళుగా రిలీజ్ సంక్షోభంలో ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు ఓటిటి రిలీజ్ కన్ఫాం అయింది. అమేజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 5న నాని వి రిలీజ్ అవుతుంది. ఇక లేటెస్ట్ గా నాని వి ట్రైలర్ రిలీజ్ చేశారు. అంచనాలకు తగినట్టుగానే వి ట్రైలర్ ఉంది.    

సైకో పాత్రలో నాని, పవర్ ఫుల్ పోలీస్ గా సుధీర్ వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. అంతేకాదు కథ, కథనాలు కూడా చాలా గ్రిప్పింగ్ గా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. మోహనకృష్ణ ఇంద్రగంటి డైరక్షన్ టాలెంట్ వి ట్రైలర్ లోనే తెలుస్తుంది. అంచనాలకు తగినట్టుగానే వి ట్రైలర్ ఉంది. ఈ ట్రైలర్ చూస్తే సినిమా పక్కా సూపర్ హిట్ అనేలా ఉంది. నాని వి డిజిటల్ ఫ్లాట్ ఫాం పై దుమ్ముదులిపేయడం ఖాయమనిపిస్తుంది. మరి ఆ హంగామా ఎలా ఉంటుందో తెలియాలంటే సెప్టెంబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే.