
మళయాళ ప్రేమమ్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించి తెలుగులో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి తెలుగు ఆడియెన్స్ ను ఫిదా చేసిన సాయి పల్లవి ఆ తర్వాత తన మార్క్ సినిమాలతో అలరిస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున సాయి పల్లవి లేటెస్ట్ గా ఓ సినిమాలో విలన్ రోల్ చేస్తుందని తెలుస్తుంది. నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్యామ్ సింగ రాయ్. ఈ సినిమాను భారీ రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా సాయి పల్లవి కూడా సినిమాలో ఉంటుందని తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం శ్యామ్ సింగ రాయ్ సినిమాలో సాయి పల్లవి విలన్ రోల్ లో కనిపిస్తుందట. నెగటివ్ పాత్రతో ఆమె అదరగొడుతుందని అంటున్నారు. శ్యామ్ సింగ రాయ్ పాత్రలో సాయి పల్లవి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ తెలియాల్సి ఉంది.