
టాలీవుడ్ లో పూజా హెగ్దే హవా ఓ రేంజ్ లో నడుస్తుందని చెప్పొచ్చు. వరుస స్టార్ ఛాన్సులతో అమ్మడు అదరగొట్టేస్తుంది. ఇప్పటికే అల్లు అర్జున్, మహేష్, ఎన్.టి.ఆర్ లతో నటించిన పూజా హెగ్దే ప్రస్తుతం ప్రభాస్ తో కూడా రాధే శ్యామ్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. అఖిల్ బ్యాచ్ లర్ సినిమాలో కూడా అమ్మడు నటిస్తున్న విషయమ్మ్ తెలిసిందే. ఇదిలాఉంటే లేటెస్ట్ గా పూజా హెగ్దే ఖాతాలో మరో క్రేజీ మూవీ వచ్చి చేరిందని తెలుస్తుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రేజీ డైరక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా ఎంపికైందని తెలుస్తుంది. స్టార్ హీరోల సినిమాలకు గ్లామర్ టచ్ ఇస్తూ పూజా హెగ్దే సూపర్ పాపులర్ అవుతుంది. ఆల్రెడీ హరీష్ శంకర్ డైరక్షన్ లో డిజే, గద్దలకొండ గణేష్ సినిమాల్లో నటించిన పూజా హెగ్దే పవన్ సినిమాతో హ్యాట్రిక్ ఛాన్స్ అందుకుంది.