వెబ్ సీరీస్ లో నాని..?

నాచురల్ స్టార్ నాని హీరోగా వి రిలీజ్ కు రెడీ అయ్యింది. డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవుతున్న తెలుగు క్రేజీ మూవీ వి. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో  దిల్ రాజు ఈ సినిమా నిర్మించారు. ఇక ఈ సినిమా తర్వాత నాని టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ డైరక్షన్ లో నాని ఈ సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ నిన్నుకోరితో హిట్ అందుకున్న ఈ కాంబో మరో సూపర్ హిట్ కు సిద్ధం అవుతున్నాడు.    

వి ప్రమోషన్స్ లో భాగంగా నాని వెబ్ సీరీస్ ల మీద తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. వెబ్ సీరీస్ లో నటించే ఛాన్స్ ఉందా అంటే.. ఏమో ఏదైనా జరగొచ్చని అంటున్నాడు. వెబ్ సీరీస్ నటించడం కన్నా నిర్మించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తా అంటున్నాడు నాని. నిర్మాతగా సినిమాలు చేస్తున్న నాని ఇక వెబ్ సీరీస్ లను ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. డిజిటల్ మార్కెట్ కు ఇప్పుడున్న క్రేజ్ ను క్యాష్ చేసుకునే క్రమంలో స్టార్స్ కూడా వెబ్ సీరీస్ బాట పడుతున్నారు.