సగం పూర్తి కావాల్సిందే అంటున్నాడు..!

అల వైకుంఠపురములో తర్వాత సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమాకు సంబందించిన మొదటి షెడ్యూల్ కేరళ అడవుల్లో షూట్ చేశారు. అయితే కరోనా వల్ల ఇప్పుడు అక్కడకు వెళ్లి షూటింగ్ చేసే పరిస్థితి లేదు అందుకే మహబూబ్ నగర్ జిల్లా సరిహద్ధు అడవుల్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట. 

2020 పూర్తయ్యే సరికి సినిమా సగం పూర్తి కావాలని అల్లు అర్జున్ అంటున్నాడట. తెలుస్తున్న సమాచారం ప్రకారం నవంబర్ ఫస్ట్ వీక్ నుండి పుష్ప సెట్స్ మీదకు వెళ్తుందట. నవంబర్ నుండి డిసెంబర్ ఎండింగ్ వరకు లాంగ్ షెడ్యూల్ ఒకటి ప్లాన్ చేస్తున్నారట. ఈ షెడ్యూల్ లోనే సినిమాకు సంబందించిన మ్యాక్సిమం సీన్స్ షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. 2021 సమ్మర్ కల్లా షూటింగ్ పూర్తి చేసి సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. మరి అనుకున్న విధంగా పుష్ప షెడ్యూల్ కంప్లీట్ చేయగలుగుతారో లేదో చూడాలి.