ఉప్పెనని రేటు కట్టారు.. కాని..!

మెగా ఫ్యామిలీ నుండి రాబోతున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ తన మొదటి సినిమానే భారీ స్థాయిలో చేశాడు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ కలిసి నిర్మించిన ఉప్పెన సినిమాతో వైష్ణవ్ తేజ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాను బుచ్చి బాబు డైరెక్ట్ చేశారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. 

ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఈ సినిమా థియేటర్ లు ఓపెన్ అయితేనే గాని రిలీజ్ చేసేలా లేరు. సినిమాకు ఓటిటి ఆఫర్స్ వస్తున్నా నో చెబుతున్నారట. నాని వి సినిమానే డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు ఉప్పెన సినిమాను అలా రిలీజ్ చేయొచ్చు కదా అని అంటే.. ఉప్పెన సినిమాకు ముందు వెనక చూసుకోకుండా పాతిక కోట్ల దాకా బడ్జెట్ పెట్టేశారట. అమేజాన్ ప్రైం ఉప్పెనకు 13 కోట్ల ఆఫర్ ఇచ్చిందట. అదే మ్యాక్సిమం ప్రైజ్ అని తెలుస్తుంది. పెట్టింది 25 కోట్లు కాగా కేవలం 13 కోట్లు మాత్రమే డిజిటల్ రైట్స్ రావడంతో ఉప్పెన సినిమా ఓటిటి రిలీజ్ హోల్డ్ లో పెట్టారు. మరి నిర్మాతలు మనసు మార్చుకుని ఓటిటి రిలీజ్ ఓకే అంటారా లేక థియేటర్లు ఓపెన్ అయ్యేదాకా వెయిట్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.