18 పేజెస్ లవ్ స్టోరీ.. నాని హీరోయిన్ కు ఛాన్స్..!

డైరక్టర్ గానే కాదు నిర్మాతగా కూడా తన అభిరుచిని చూపిస్తున్న సుకుమార్ ప్రస్తుతం తన డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తూనే మరో పక్క తన నిమాణంలో వస్తున్న 18 పేజెస్ సినిమాను సెట్ రైట్ చేస్తున్నాడు. నిఖిల్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో ముందు లావణ్య త్రిపాఠి హీరోయిన్ అన్నారు.. ఆమె ప్లేస్ లో అనుపమ పరమేశ్వరన్ ను సెలెక్ట్ చేశారని మధ్యలో వార్తలు వచ్చాయి. లేటెస్ట్ గా అనుపమ కూడా ఆ సినిమా నుండి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. 

అనుపమ పరమేశ్వరన్ ప్లేస్ లో నాని గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్ ఛాన్స్ అందుకుందట. విక్రం కుమార్ డైరక్షన్ లో నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాలో ప్రియాంకా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. గ్యాంగ్ లీడర్ తర్వాత తెలుగులో మరో ఛాన్స్ అందుకోని ప్రియాంకా 18 పేజెస్ లవ్ స్టోరీలో నటిస్తుంది. మరి ఈ సినిమాతో అయినా అమ్మడికి వరుస అవకాశాలు వస్తాయేమో చూడాలి.