
అక్కినేని నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమా మరో షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంటే గుమ్మడికాయ కొట్టేస్తారట. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే సినిమా నుండి రిలీజైన సాంగ్ ఆడియెన్స్ ను అలరించింది. సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదిలాఉంటే ఈ సినిమా తర్వాత నాగ చైతన్య విక్రం కుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది.
మనం తర్వాత చైతుతో విక్రం కుమార్ చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు థ్యాంక్యు టైటిల్ పరిశీలనలో ఉండగా సినిమా హారర్ నేపథ్యంతో వస్తుందని తెలుస్తుంది. విక్రం కుమార్ మొదటి ప్రయత్నంగా చేసిన 13బి సినిమా హారర్ జానర్ లో వచ్చిందే.. మరోసారి అదే పంథాలో సినిమా చేస్తున్నాడు విక్రం కుమార్. కెరియర్ నాగ చైతన్య మొదటిసారి ఈ జానర్ సినిమా చేస్తున్నాడని చెప్పొచ్చు. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని డీటైల్స్ త్వరలో వెల్లడవుతాయని తెలుస్తుంది.