
అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ హీరోగా వస్తున్న సినిమా కపటధారి. ప్రదీప్ కృష్ణమూర్తి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా క్రియేటి ఎంటర్టైనర్స్ బ్యానర్ లో ధనంజయన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ నాగ చైతన్య తన ట్విట్టర్ లో రిలీజ్ చేశారు. సినిమాలో సుమంత్ పోలీస్ పాత్రలో కనిపిస్తున్నారు.
వాకీ టాకీ పట్టుకుని సీరియస్ లుక్ తో కపటధారి సుమంత్ ఫస్ట్ లుక్ ఇంప్రెస్ చేసింది. ఈ సినిమా కన్నడ సూపర్ హిట్ మూవీ కలువధారి కి అఫీషియల్ రీమేక్ అవుతుంది. సినిమాలో సుమంత్ సరసన నందిత హీరోయిన్ గా నటిస్తుంది. నాజర్, పూజా కుమార్, సంపత్ కీ రోల్స్ లో నటిస్తున్నారు. ఇదే సినిమాను తమిళంలో సిబిరాజ్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. తమిళంలో ఈ సినిమాకు టైటిల్ గా కబడదారి అని పెట్టారని తెలుస్తుంది.