పెళ్ళికి సిద్ధమైన యువ హీరో..!

యువ హీరో శర్వానంద్ ప్రేమలో పడ్డాడా.. త్వరలోనే అతని పెళ్ళి కబురు రానుందా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. తన చిన్ననాటి స్నేహితురాలినే శర్వానంద్ ప్రేమించి పెళ్ళి చేసుకుంటున్నాడని సమాచారం. అయితే ఆమె ఎవరన్న డీటైల్స్ మాత్రం బయటకు రాలేదు. తెలుగులో విలక్షణ నటుడిగా డిఫరెంట్ సినిమాలు చేస్తూ వస్తున్న శర్వానంద్ ఈ ఇయర్ జానుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.      

ప్రస్తుతం శ్రీకారం సినిమా చేస్తున్న శర్వానంద్ ఆ సినిమాలో రైతుగా కనిపించనున్నారు. ఈ సినిమాను నూతన దర్శకుడు కిశోర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ లాక్ డౌన్ టైంలోనే యువ హీరోలు నిఖిల్, నితిన్, రానా తమ బ్యాచ్ లర్ లైఫ్ కు గుడ్ బై చెప్పారు. శర్వానంద్ కూడా ఆ లిస్ట్ లో ఉన్నాడని తెలుస్తుంది. శర్వానంద్ పెళ్ళిపై అఫీషియల్ న్యూస్ బయటకు రావాల్సి ఉంది.