అల్లు అర్జున్ 21 అంతా అక్కడ వారేనా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ రిలీజ్ ప్లాన్ చేశారు. సుకుమార్ డైరక్షన్ లో అల్లు అర్జున్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచారు సుకుమార్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. 

ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో అల్లు అర్జున్ సినిమా ఫిక్స్ చేసుకున్నారు. ఈ సినిమాకు సంబందించిన ఎనౌన్స్ మెంట్ తోనే ప్రీ లుక్ కూడా రిలీజ్ చేశారు. పుష్ప సినిమా తర్వత వస్తుంది కాబట్టి ఈ సినిమాను కూడా నేషనల్ వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. అందుకే సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామని సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అంతేకాదు విలన్ తో పాటుగా సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ లో కూడా బాలీవుడ్ స్టార్స్ నటిస్తారని అంటున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ కొరటాల శివ సినిమా అదిరిపోయే ప్లాన్ వేస్తున్నారని చెప్పొచ్చు.