బాలుకి కరోనా నెగటివ్.. అసత్య ప్రచారాలు నమ్మొద్దు..!

ఎస్పి బాల సుబ్రహ్మణ్యంకు కరోనా నెగటివ్ వచ్చినదన్న వార్తలపై ఎస్పి చరణ్ స్పందించారు. నాన్న గారి ఆరోగ్యానికి సంబందించి ఎప్పటికప్పుడు తను సమాచారం అందిస్తున్నాని.. దురదృష్టవశాత్తు ఈరోజు ఉదయం నుండి నాన్నకి కరోనా నెగటివ్ వచ్చిందన్న వార్తలు వస్తున్నాయి. తాను చెప్పే వరకు ఈ అసత్య ప్రచారాలను నమ్మొద్దని అన్నారు ఎస్పి చరణ్.  

నాన్న ఆరోగ్య నిలకడగానే ఉంది కాని ఇప్పటికి ఎక్మో సాయంతోనే చికిత్స అందిస్తున్నారు. నాన్న గారి ఆరోగ్య గురించి ఎలాంటి అప్డేట్ అయినా నేనే ఇస్తా. ఆయన ఆరోగ్య నిలకడగానే ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితిపై డాక్టర్లతో సంప్రదించిన తర్వాత తానే వెళ్ళడిస్తానని అన్నారు ఎస్పి చరణ్.