
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కలక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రత్యేకంగా చిరు కోసం ఓ స్పెషల్ గిఫ్ట్ పంపించారు. చెక్కతో చేసిన హార్లీ డేవిడ్ సన్ బైక్ మోడల్ ఒకటి చిరుకి మోహన్ బాబు పంపించడం విశేషం. చిరంజీవి నాకు మంచి మిత్రుడు ఆయనపేరులొఏ చిరంజీవి అంటే ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఎల్లకాలము చిరంజీవై వర్ధిల్లు గాక అంటూ మోహన్ బాబు బర్త్ డే నాడు చిరుని విష్ చేశారు.
విష్ తో సరిపెట్టకుండా చిరుకి ఇలా ఓ స్పెషల్ గిఫ్ట్ కూడా పంపించారన్నమాట. మోహన్ బాబు కానుక అందుకున్న చిరు దాన్ని చూసి అందులో అతని రాజసం, వ్యక్తిత్వం తెలుస్తున్నాయని ప్రత్యేకంగా థ్యాక్యూ అని సోషల్ మెసేజ్ లో పెట్టారు. ఒకరి మీద ఒకరు సెటైర్లు పంచులు వేసుకుంటూ నిత్య వార్తల్లో ఉండేవారు. తెలుగు సినిమా వజ్రోత్సవాల టైం లో వీరి మధ్య గొడవ మరింత ముదిరింది. అదంతా జరిగిపోయిన విషయం ఇప్పుడు ఈ హీరోలిద్దరు మంచి సత్సంబంధాలతో ఉన్నారు. ఈ ఇద్దరిని ఇలా చూసి ఆ హీరోల ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.
నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజునాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి... ... ... Thank you @themohanbabu 🤗 pic.twitter.com/8ROLZ6yfwI