సంబంధిత వార్తలు

కోలీవుడ్ స్టార్ హీరోగా సుధ కొంగర డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆకాశం నీ హద్దురా. 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్య నిర్మిస్తున్న ఈ సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కాబోతుంది. అమేజాన్ ప్రైమ్ లో అక్టోబర్ 30న ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తుండగా కలక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు.
ఇక ఈ సినిమా డిజిటల్ రిలీజ్ ద్వారా వచ్చిన ఎమౌంట్ లో 5 కోట్ల రూపాయలు కరోనా టైంలో నిత్యావసరాలకు ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులకు అందిస్తున్నట్టుగా ప్రకటించారు సూర్య.