
రాక్షసుడు సినిమాతో కెరియర్ లో మొదటి హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో అల్లుడు అదుర్స్ సినిమా చేస్తున్నాడు. కరోనా లాక్ డౌన్ కు ముందు 40 శాతం వరకు షూటింగ్ పూర్తి కాగా లాక్ డౌన్ లో రఫ్ ఎడిట్ కట్ చేయగా సినిమా అనుకున్న విధంగా రాకపోవడంతో లాక్ డౌన్ లో కథ మార్చేశాడట. త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా ఇప్పుడు మార్చిన కథతో షూట్ చేస్తారని తెలుస్తుంది.
రభస, హైపర్ సినిమాల తర్వాత గ్యాప్ తీసుకున్న సంతోష్ శ్రీనివాస్ బెల్లంకొండ శ్రీనివాస్ తో ఈ సినిమా చేస్తున్నాడు. అల్లుడు అదుర్స్ తో అటు డైరక్టర్ ఇటు హీరో ఇద్దరు హిట్ టార్గెట్ పెట్టుకున్నారు. రాక్షసుడు సినిమతో మొదటి హిట్ అందుకున్న బెల్లంకొండ హీరో ఈ సినిమాతో సత్తా చాటాలని చూస్తున్నాడు. సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.