విజయ్ దేవరకొండతో వి డైరక్టర్..!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ టాలెంటెడ్ డైరక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. టాలెంటెడ్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న మోహనకృష్ణ నానితో వి సినిమా చేశాడు. ఆ సినిమా అమేజాన్ ప్రైమ్ లో త్వరలో రిలీజ్ కాబోతుంది.  

ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో సినిమా ఫిక్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను 100 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేశారట. డిఫరెంట్ స్టోరీస్ తో వస్తున్న మోహనకృష్ణ భారీ బడ్జెట్ తో వస్తున్నాడు అంటే తప్పకుండా సినిమా సబ్జెక్ట్ కూడా అద్భుతంగా కుదిరి ఉంటుందని అంటున్నారు. విజయ్ దేవరకొండతో మోహనకృష్ణ సినిమాపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.