
వినాయక చవితి పండుగ సందర్భంగా కొత్త జంట నితిన్, షాలిని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ లోని హీరో నీతిన్ ఇంట్లోనే గణేషుడి పూజ నిర్వహించారు. నితిన్, షాలినిలు స్వయంగా ఈ పూజా నిర్వహించారు. నితిన్ మదర్ విద్యా రెడ్డి పూజాకు సహకారం అందించారు. నితిన్, షాలినిలు జూలై 25న పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక సినిమాల విషయానికి వస్తే ఈ ఇయర్ మొదట్లో భీష్మతో హిట్ అందుకున్న నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అందాదున్ రీమేక్ లో కూడా నితిన్ నటిస్తున్నాడు. మేర్లపాక గాంధి డైరక్షన్ లో అందాదున్ రీమేక్ జరుగుతుంది. నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ లో అందాదున్ తెలుగు రీమేక్ చేస్తున్నారు.