సెట్స్ మీదకు రాధే శ్యామ్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా రాధే శ్యామ్. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. పిరియాడికల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమా కొంతమేరకు షూటింగ్ జరుపుకోగా కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు.   

దాదాపు ఆరు నెలల నుండి షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన రాధే శ్యాం టీం తిరిగ్ మళ్ళీ షూటింగ్ కు సిద్ధమవుతుంది. సెప్టెంబర్ సెకండ్ వీక్ నుండి రాధే శ్యామ్ సెట్స్ మీదకు వెళ్ళబోతుందని తెలుస్తుంది. ఈసారి లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు డైరక్టర్ రాధాకృష్ణ తన ట్విట్టర్ లో వెల్లడించారు. ప్రభాస్ తో పాటుగా పూజా హెగ్దే మెయిన్ స్టార్ కాస్ట్ అంతా ఈ షెడ్యూల్ లో పాల్గొంటారని తెలుస్తుంది.