
మెగాస్టార్ చిరంజీవి 65వ పుట్టినరోజు సందర్భంగా కొరటాల శివ డైరక్షన్ లో చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా ఆచార్య ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. చేతిలో కత్తి.. పక్కనే పడి ఉన్న రౌడీలు.. చిరు వెనుక భాగమే కనిపించగా.. ఆయన ఎదురుగా ఊరి జనం కనిపిస్తున్నారు. పోస్టర్ లో ధర్మస్థలి అని ఉండటం గమనించవచ్చు. మొత్తానికి కొరటాల శివ ఆచార్య ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమాపై అంచనాలు పెంచాడు.
కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరుతో పాటుగా రాం చరణ్ కూడా స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. కాజల్ అగర్వాల్ ఒక హీరోయిన్ గా నటిస్తున్న ఆచార్య సినిమాలో సెకండ్ హీరోయిన్ గా రష్మిక నటిస్తుందని తెలుతుంది. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2021 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
#Acharya pic.twitter.com/0y9f9tI2GF