
తొలి సినిమా పటాస్ నుండి సరిలేరు నీకెవ్వరు వరకు తీసిన ప్రతి సినిమా హిట్ అందుకున్న అనీల్ రావిపుడి స్టార్ డైరక్టర్స్ లిస్ట్ లో చేరాడు. ప్రస్తుతం ఎఫ్-3 స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్న అనీల్ రావిపుడి తను ఓ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నట్టు తెలుస్తుంది. అనీల్ రావిపుడి రాసిన కథకు నాలుగు స్తంభాలాట టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాను నక్కిన త్రినాథ రావు డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది.
మల్టీస్టారర్ కథగా వస్తున్న ఈ సినిమాలో సాయి ధరం తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోలుగా నటిస్తారని తెలుస్తుంది. అనీల్ రావిపుడి మార్క్ ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్ తో వస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తాయి. ఎఫ్-3 తర్వాత బాలకృష్ణతో సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు అనీల్ రావిపుడి. ఆ సినిమాకు కూడా రామారావు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్.