
ఆగష్టు 22 శనివారం మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా మెగా ఫ్యాన్స్ కామన్ డిపి రిలీజ్ చేశారు. మెగా ఫ్యాన్స్ అంతా ఈ డిస్ ప్లే పిక్ ను రేపు మొత్తం ఉంచనున్నారు. మెగాస్టార్ చిరంజీవి డిపిలో స్పెషల్ ఏంటంటే ఖైది నుండి ఒక్కోమెట్టు ఒక్కో సినిమాను సూచిస్తూ సైరాతో ముగించారు. కామన్ డిపి డిజైన్ అదిరిపోయింది.
స్టార్ సినిమాల బర్త్ డే ట్రెండ్స్ ఇప్పుడు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఎన్.టి.ఆర్, మహేష్ బర్త్ డే లకు వారి ఫ్యాన్స్ చేసిన హంగామా తెలిసిందే. ఈమధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కి సంబందించి ట్విట్టర్ ట్రెండ్ రికార్డ్ సృష్టించగా లేటెస్ట్ గా చిరు బర్త్ డే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ చేస్తున్నారు. ఇక బర్త్ డే కానుకగా చిరు 152వ సినిమా ఆచార్య ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.