
సరిలేరు నీకెవ్వరు తర్వాత సూపర్ స్టార్ మహేష్ పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళితో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఇదిలాఉంటే పరశురాం సినిమాకు ఓకే చెప్పడానికి ముందు మహేష్ ముగ్గురు డైరక్టర్స్ ను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. అందులో మొదటగా వంశీ పైడిపల్లి ఉన్నాడు. ఆల్రెడీ మహేష్ తో మహర్షి లాంటి హిట్ అందుకున్న ఈ డైరక్టర్ మరో కథతో మహేష్ ను కలిశాడు. అయితే కథ బాగున్నా ఫుల్ స్క్రిప్ట్ మహేష్ కు నచ్చకపోవడంతో మహేష్ చేయనని చెప్పేశాడట.
ఇక ఈ గ్యాప్ లోనే కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ కూడా మహేష్ కోసం ఓ కథ సిద్ధం చేశాడట. అయితే మహేష్ కు ఎందుకో అతను చెప్పిన స్టోరీ లైన్ పెద్దగా ఇంప్రెస్ చేయలేదని అతన్ని లైట్ తీసుకున్నాడు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ కూడా మహేష్ కు ఓ స్టోరీ లైన్ వినిపించాడట కాని మహేష్ అతనికి సారీ చెప్పేశాడట. ఆ ముగ్గురిని కాదని మహేష్ పరశురాంకు ఓకే చెప్పాడు. మరి సర్కారు వారి పాట సినిమాలో అంత స్పెషల్ ఏముందో తెలియాలంటే సినిమ్మా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.