పదివేల మందికి సిసిసి సాయం..!

మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సీసీసీ తరపున సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు అందిస్తున్నారని తెలిసిందే. కరోనా టైంలో సినీ కార్మికులకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా సినీ కార్మికులకు సాయం అందించగా మూడో విడత కూడా సీసీసీ సపోర్ట్ గా నిలుస్తుంది. ఈసారి పదివేల మందికి నిత్యావసరాలు అందిస్తున్నారని తెలుస్తుంది.       

సినీ కార్మికులకే కాదు థియేటర్ లో పనిచేసే కార్మికులకు.. పోస్టర్లు అతికించే వాళ్లు.. టికెట్ కౌంటర్ ఉద్యోగులకు సైతం సీసీసీ సాయం అందిస్తుంది. ఇప్పటికే 3వ విడత నిత్యావసరాల పంపిణీ మొదలైంది.. ఈ కష్టం తాత్కాలికమే ఎంతో కాలం ఉండదు. ఈ కష్టాన్ని తట్టుకుని నిలబడదాం అని చిరు అన్నారు.