సత్యదేవ్, తమన్నా.. గుర్తుందా శీతాకాలం..!

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో హిట్ అందుకున్న సత్యదేవ్ ప్రస్తుతం కన్నడ రీమేక్ సినిమాలో నటిస్తున్నాడు. లవ్ మాక్ టైల్ సినిమా రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గుర్తుందా శీతాకాలం టైటిల్ ఫిక్స్ చేశారు. కన్నడలో కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగులో నాగ శేఖర్ డైరెక్ట్ చేస్తున్నారు.

ఇక ఈ టైటిల్ లో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. గుర్తుందా శీతాకాలం సినిమా టైటిల్ నితిన్ ఛల్ మోహన్ రంగకు ముందు అనుకున్న టైటిల్ అట. త్రివిక్రం ఈ టైటిల్ ఫిక్స్ చేయగా చిత్రయూనిట్ మొత్తం ఛల్ మోహన్ రంగకు ఓటేయడంతో అది ఫిక్స్ చేశారు. సత్యదేవ్, తమన్నా సినిమాకు ఈ టైటిల్ ఫిక్స్ చేశారు. గుర్తుందా శీతాకాలం టైటిల్ చాలా ప్లెసెంట్ గా ఉంది.