ప్రభాస్ చెల్లిగా నివేదా థామస్..!

రాధే శ్యామ్ పూర్తి కాకుండానే మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు ప్రభాస్. అందులో ఒకటి నాగ్ అశ్విన్ సినిమా కాగా మరోటి ఓం రౌత్ డైరక్షన్ లో చేస్తున్న ఆదిపురుష్. ఈ రెండు క్రేజీ సినిమాలతో ప్రభాస్ మరో మూడేళ్ళు బిజీ అవనున్నాడు. ఇదిలాఉంటే ప్రభాస్ 21వ సినిమా సైన్స్ ఫిక్షన్ స్టోరీగా రాబోతుంది. ఈ సినిమాలో దీపిక పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా సెకండ్ హీరోయిన్ గా నివేదా థామస్ నటిస్తుందని అంటున్నారు.            

ప్రభాస్ 21వ సినిమాలో నివేదా థామస్ ఉన్నది నిజమే కాని ఆమె హీరోయిన్ గా కాదు ప్రభాస్ సిస్టర్ పాత్రలో కనిపిస్తుందట. ఓ పక్క హీరోయిన్ గా చేస్తూనే మరోపక్క ఇలా సైడ్ రోల్స్ చేయడం కేవలం నివేదా థామస్ వల్లే అవుతుందని చెప్పొచ్చు. రజిని దర్బార్ సినిమాలో కూడా ఆమె సపోర్టింగ్ రోల్ చేసింది. కేవలం హీరోయిన్ గానే కాదు ఎలాంటి పాత్ర అయినా చేస్తానని ప్రూవ్ చేసుకుంటున్న నివేదా థామస్ స్టార్ సినిమాల్లో చిన్న పాత్రలతో కూడా అలరిస్తుంది.