రజిని, కమల్ మల్టీస్టారర్..!

మానగరం సినిమాతో సత్తా చాటి.. ఖైదీతో సూపర్ హిట్ అందుకున్న తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో మాస్టర్ సినిమా చేస్తున్నాడు. రిలీజ్ కు సిద్ధమైన ఈ సినిమా ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఖైదీ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. కార్తికి తెలుగులో సూపర్ ఫాలోయింగ్ ఉండగా అది ఖైదీ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. అంతేకాదు సినిమాలో కార్తి కొత్తగా కనిపించే సరికి ఆడియెన్స్ అలరించారు. 

ఖైదీ హిట్ తో మైత్రి మూవీ మేకర్స్ లోకేష్ కనగరాజ్ కు తెలుగు, తమిళ బైలింగ్వల్ ఆఫర్ ఇచ్చారు. అందుకు ఓకే చెప్పిన లోకేష్ అంతకంటే ముందు సూపర్ స్టార్ రజినికాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ లతో ఓ క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడు. ఇద్దరు కూడా మంచి కథ దొరికితే కలిసి నటించడానికి సిద్ధమని అప్పట్లో చెప్పారు. లోకేష్ కనగరాజ్ చెప్పిన లైన్ నచ్చడంతో ఇద్దరు సూపర్ స్టార్స్ ఓకే అన్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుంది.