మూడు గెటప్పుల్లో అక్కినేని హీరో..!

మజిలీ, వెంకీమామ హిట్లతో కెరియర్ లో సక్సెస్ జోష్ తో దూసుకెళ్తున్న నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరక్షన్ లో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చైతు సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ తర్వాత నాగ చైతన్య విక్రం కుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు థ్యాంక్స్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. సినిమాలో చైతు మూడు గెటప్పుల్లో కనిపిస్తాడని అంటున్నారు. అక్కినేని ఫ్యామిలీకి మనం లాంటి హిట్ ఇచ్చిన డైరక్టర్ విక్రం కుమార్ అఖిల్ తో హలో సినిమా తీసినా వర్క్ అవుట్ కాలేదు.   

ఇక లేటెస్ట్ గా చైతు కోసం మంచి కథ సిద్ధం చేశాడట. సినిమాలో హీరోయిన్ గా సమంత నటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. మరి చైతు డిఫరెంట్ గెటప్పుల్లో నటిస్తున్నాడు అని సినిమాపై అచనాలు పెంచేస్తున్న విక్రం ఈ సినిమాతో మనం లాంటి మరో మెమరబుల్ హిట్ అందిస్తాడేమో చూడాలి. ఈ సినిమా తర్వాత నాగ చైతన్య ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.