
ఓం రౌత్ డైరక్షన్ లో టీ సీరీస్ నిర్మిస్తున్న ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఆదిపురుష్ స్పెషల్ అప్డేట్ యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. 3డి టెక్నాలజీతో 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడుగా చేస్తే రావణుడిగా ఎవరు చేస్తున్నారనే డిస్కషన్స్ మొదలయ్యాయి. ఓం రౌత్ డైరక్షన్ లో వచ్చిన తానాజి సినిమాలో సైఫ్ ఆలి ఖాన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు ఇప్పుడు ఆదిపురుష్ లో కూడా రావణుడిగా సైఫ్ నటిస్తాడని అంటున్నారు.
ఇక ఈ సినిమాలో సీత పాత్ర గురించి కూడా సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. అనుష్క, కీర్తి సురేష్ ఇలా ఎవరికి ఇష్టం వచ్చిన పేర్లు వారు చెబుతున్నారు. ప్రభాస్ రాముడైతే సీతగా అనుష్క ఉండాల్సిందే అని కొందరు. మహానటి కీర్తి సురేష్ సీత పాత్రలో బాగుంటుందని మరికొందరు సోషల్ మీడియా వేదికగా గొడవ పడుతున్నారు. మొత్తానికి ప్రభాస్ రాముడని కన్ఫాం కాగా రావణుడు, సీత ఎవరన్నది తెలియాల్సి ఉంది.