
అల వైకుంఠపురములో సక్సెస్ జోష్ లో ఉన్న అల్లు అర్జున్ సుకుమార్ డైరక్షన్ లో పుష్ప కోసం తన లుక్ చేంజ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఒత్తుగా పెరిగిన హెయిర్ తో అల్ట్రా మోడ్రెన్ లుక్ తో కనిపిస్తున్నాడు అల్లు అర్జున్. ఈమధ్య మెగా డాటర్ నిహారిక ఎంగేజ్మెంట్ లో కూడా అల్లు అర్జున్ కొత్త లుక్ తో అదరగొట్టాడు. లేటెస్ట్ గా గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వచ్చి అక్కడ క్రేజీ స్టిల్ ఇచ్చాడు. ఎప్పుడు సినిమా కథల డిస్కషన్స్ తో బిజీగా గొడవ గొడవగా ఉండే ఆఫీస్ సైలెంట్ గా ఉందని అంటున్నాడు అల్లు అర్జున్.
పుష్ప సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో మొదలుపెట్టి 2021 సెకండ్ హాఫ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తరాత అల్లు అర్జున్ తన 21వ సినిమాను కొరటాల శివ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ పుష్ప సినిమాను ఐదు భాషల్లో రిలీజ్ ఎనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు అల్లు అర్జున్.