
ఎప్పుడు సరికొత్త ప్రయోగాలతో సక్సెస్ ఫాంలో ఉండే కింగ్ నాగార్జున ఈమధ్య కెరియర్ లో జోష్ తగ్గించాడు. ఆఫీసర్, మన్మధుడు 2 సినిమాలతో నాగార్జున చాలా వెనుకపడ్డాడు. ప్రస్తుతం సోల్మన్ డైరక్షన్ లో వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్న నాగార్జున ఆ సినిమా తర్వాత ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా రైడ్ రీమేక్ గా ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో నాగార్జున సినిమా ఉంటుందని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా తర్వాత నాగార్జున పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని అంటున్నారు. పూరీ జగన్నాథ్ తో నాగ్ ఆల్రెడీ సూపర్, శివమణి సినిమాలు చేశాడు. రెండు సినిమాలు మంచి ఫలితాన్ని అందుకున్నాయి. పూరీ డైరక్షన్ లో నాగ్ సినిమా అంటే అక్కినేని ఫ్యాన్స్ లో జోష్ కనబడుతుంది. ప్రస్తుతం పూరీ విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేశారు.