
కన్నడ భామ రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగులో ఫుల్ ఫాంలో ఉంది. యూత్ లో సూపర్ క్రేజ్.. చేస్తున్న సినిమాలన్ని హిట్ అవడంతో దర్శక నిర్మాతలంతా ఆమె వెంట పడుతున్నారు. ఈ ఇయర్ ఆల్రెడీ సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమా, నితిన్ తో భీష్మ సినిమాల్లో నటించి హిట్ అందుకున్న అమ్మడు ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్పలో ఛాన్స్ కొట్టేసింది. తెలుగుతో పాటుగా తమిళ, హిందీ, కన్నడ, మళయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ ఉంటుందని తెలిసిందే.
ఇదిలాఉంటే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా రష్మికకు లక్కీ ఛాన్స్ వచ్చిందట. సినిమాలో చరణ్ కూడా ఒక 30 నిమిషాల రోల్ చేస్తున్నాడని తెలిసిందే. చిరుకి జోడీగా కాజల్, చరణ్ కు జతగా రష్మిక నటిస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలో రష్మిక పాత్ర నిడివి 20 నిమిషాలు కాగా ఆ పాత్ర కోసం అమ్మడు కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది. రష్మిక డిమాండ్ చేసినంత ఇచ్చి ఆమెను సినిమాను ఓకే చేశారట. ఆచార్య, పుష్ప సినిమాలే కాకుండా మరో రెండు పెద్ద ప్రాజెక్టులు అమ్మడి చేతిలో ఉన్నట్టు తెలుస్తుంది.