
నాచురల్ స్టార్ నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా V. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో సుధీర్ బాబు కూడా మరో హీరోగా నటించారు. అదితి రావు, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా రిలీజ్ కన్ఫ్యూజన్ తొలగిపోయింది. కొన్నాళ్ళుగా ఓటిటి రిలీజ్ పై వార్తలన్నిటిని నిజం చేస్తూ నాని లేటెస్ట్ గా ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశాడు. సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలంటే అంటూ రేపు ఓ ఎనౌన్స్ మెంట్ వస్తుందని అన్నాడు నాని.
దాదాపుగా నాని ప్రకటించే ఆ ఎనౌన్స్ మెంట్ V రిలీజ్ డేట్ కావొచ్చని అనుకుంటున్నారు. అమేజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ ప్రైజ్ ఆఫర్ చేయడంతో నిర్మాత దిల్ రాజు వి ఓటిటి రిలీజ్ కు ఫిక్స్ అయ్యారు. ముందు హీరో నాని, డైరక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ ఓటిటి ఆఫర్స్ రిజెక్ట్ చేసినా సినిమా లేట్ చేయడం కరెక్ట్ కాదని ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఓటిటి లో రిలీజ్ అవుతున్న తెలుగు పెద్ద సినిమా ఇదే అవడం విశేషం. మరి నాని V డిజిటల్ హంగామా ఎలా ఉండబోతుందో చూడాలి.
"V" have an announcement, tomorrow! Watch this space for more.@nameisnani @isudheerbabu @i_nivethathomas @aditiraohydari @mokris_1772 @SVC_official #DilRaju #Shirish #HarshithReddy @ItsAmitTrivedi @MusicThaman @pgvinda #MarthandKVenkatesh pic.twitter.com/tAngEOuhxh