విషమంగానే బాలు ఆరోగ్యం

గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతున్నారు. చెన్నైలోని ఎం.జి.ఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం పరిస్థ్తితి విషమంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బాలుకి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. వైద్య నిపుణుల పర్యవేక్షణలో బాలు చికిత్స పొందుతున్నారని ఎం.జి.ఎం హాస్పిటల్ హెల్త్ బులిటెన్ లో వెళ్లడించారు.       

కరోనా నుండి బాలు కోలుకోవాలని సంగీత ప్రియులంతా ప్రార్ధనలు చేస్తున్నారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు కోరుతున్నారు. బాలు క్షేమంగా రావాలని మళ్ళీ తన పాటలని వినిపించాలని మెగాస్టార్ చిరంజీవి, ఆర్పీ పట్నాయక్, సిరివెన్నెల సీతారామశాస్త్రి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.