
మళయాళ సూపర్ హిట్ మూవీ తెలుగు రీమేక్ మళ్ళీ చేతులు మారినట్టు తెలుస్తుంది. నిన్నమొన్నటిదాకా రానా, రవితేజ కలిసి చేస్తారని అనుకున్న ఈ మూవీ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. త్రివిక్రం రికమెండేషన్ తో పవన్ ఈ సినిమా చూసి చేసేద్దాం అన్నాడట. వెంకీ అట్లూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమాలో పవన్ తో పాటుగా కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటిస్తాడని అంటున్నారు.
తమిళ సినిమాలు చేస్తూ తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న విజయ్ సేతుపతి తెలుగులో సైరా సినిమాలో చిన్న పాత్ర చేశాడు. ఇక ఉప్పెన సినిమాలో విలన్ గా నటించాడు. అల్లు అర్జున్ పుష్పలో నటించాల్సింది కాని డేట్స్ అడ్జెస్ట్ కాక ఆ ప్రాజెక్ట్ వదిలేశాడని తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో పవన్ తో పాటుగా విజయ్ సేతుపతి కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారని తెలుస్తుంది. అదే జరిగితే పవన్, విజయ్ కాంబో సిని ప్రియులను ఆకట్టుకోవడం ఖాయమని చెప్పొచ్చు.