
కీర్తి సురేష్ లీడ్ రోల్ లో నగేష్ కుకునూర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా గుడ్ లక్ సఖి. ఈ సినిమాను ఓటిటి రిలీజ్ కన్ఫాం చేశారు. అమేజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది. 13 కోట్ల డిజిటల్ డీల్ సెట్ చేసుకున్నారు. కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ సినిమా ఆల్రెడీ అమేజాన్ ప్రైమ్ లో రిలీజైంది. ఈ లాక్ డౌన్ టైం లో కీర్తి సురేష్ నటించిన సినిమాలన్ని ఓటిటి బాట పడుతున్నాయి. ఆల్రెడీ పెంగ్విన్ రిలీజ్ అవగా లేటెస్ట్ గా గుడ్ లక్ సఖి కూడా త్వరలో డిజిటల్ రిలీజ్ అవబోతుంది.
అంతేకాదు కీర్తి సురేష్ నటించిన మిస్ ఇండియా సినిమా కూడా డిజిటల్ రిలీజ్ కు మొగ్గుచూపుతున్నారట. సెప్టెంబర్ నుండి థియేటర్లు తెరచుకుంటాయని చెబుతున్నా దానికి సంబందించి ఎలాంటి అప్డేట్ రాలేదు. థియేటర్లు ఓపెన్ అయినా.. జనాలు ఇదివరకులా సినిమా హాళ్ళకు వస్తారన్న నమ్మకం లేదు. అందుకే మీడియం, స్మాల్ బడ్జెట్ సినిమాలు ఓటిటి బాట పడుతున్నాయి. ఓటిటి లో ఫ్యాన్సీ ప్రైజ్ వస్తే ఎలాగు శాటిలైట్ రైట్స్ కూడా వస్తాయి కాబట్టి బడ్జెట్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.