చిరు మల్టీస్టారర్ లో మెగా హీరో కాదు..!

 మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ఫస్ట్ లుక్ చిరు పుట్టినరోజు సందర్భగా ఆగష్టు 22న రిలీజ్ చేస్తున్నారని తెలిసిందే. ఈ సినిమా తర్వాత కె.ఎస్ రవింద్ర డైరక్షన్ లో మెగాస్టార్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో చిరుతో పాటుగా మరో హీరోకి ఛాన్స్ ఉన్నట్టు టాక్. డైరక్టర్ బాబి సినిమాలో చిరుతో పాటుగా సాయి ధరం తేజ్ నటిస్తాడని అన్నారు. కాని చిరు మల్టీస్టరర్ లో మెగా హీరో కాకుండా వేరే హీరో చేస్తాడని లేటెస్ట్ టాక్.  

కథ ప్రకారంగా ఆ పాత్ర ఎవరికి సూట్ అవుతుందో చూసి నాన్ మెగా హీరోనే సెలెక్ట్ చేస్తారని తెలుస్తుంది. ఇక ఆచార్య సినిమా 2021 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే బాబి సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఈ సినిమా తర్వాత మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ లో కూడా చిరు నటిస్తాడని తెలుస్తుంది. సాహో డైరక్టర్ సుజిత్ కు ఈ రీమేక్ బాధ్యతలు అప్పచెప్పారని తెలిసిందే. ఇక ఇదే కాకుండా మెహెర్ రమేష్ డైరక్షన్ లో కూడా చిరు సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్.