నిజమైన హీరోలను చూస్తున్నా..!

సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో ప్లాస్మా దాతల అభినందన కార్యక్రమంలో డైరక్టర్ రాజమౌళి పాల్గొన్నారు. నేరం జరిగినప్పుడు మాత్రమే వస్తారని అనుకునే పోలీసులు రక్షక భటులనే పేరుని సార్ధకం చేసుకున్నారని రాజమౌళి అన్నారు. డ్యూటీలో భాగం కాకపోయినా సరే సమాజం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని సిపి సజ్జనార్ ను రాజమౌళి అభినందించారు.     

ప్లాస్మా వాలంటీర్లను.. సెలబ్రిటీలను తీసుకొచ్చి ఒక వేదిక కల్పిస్తున్నారు ఇది చిన్న విషయం కాదని అన్నారు. ప్లాస్మా దాతలు, కోవిడ్ పేషంట్లకు సహకారం అందించేలా చేయడం రోజుకి 70 మంది ప్లాస్మా దాతలను తీసుకురావడం గొప్ప విషయమని అన్నారు రాజమౌళి. ఈ టైంలో దాతలు నిజమైన యోధులని అనిపిస్తుంది.. రోజూ తను చాలామంది హీరోలను చూస్తుంటాను.. ఈరోజు ప్రత్యక్షంగా హీరోలను చూస్తున్నా.. తాను కూడా ఇమ్యునిటీ డెవెలప్ అయితే త్వరలోనే ప్లాస్మా డొనేట్ చేస్తానని అన్నారు రాజమౌళి. కార్యక్రమంలో భాగంగా ప్లాస్మా దాతలకు సన్మానం చేశారు.