
ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభస్ హీరోగా టీ సీరీస్ నిర్మాణంలో ఓ భారీ ప్రాజెక్ట్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. ఓం రౌత్ డైరక్షన్ లో ప్రభాస్ ను ఆదిపురుషుడిగా చూపించబోతున్నారు. ఆదిపురుష్ టైటిల్ పోస్టర్ తో సర్ ప్రైజ్ చేశారు చిత్రయూనిట్. ఇలాంటి పాత్రలో నటించడం ఎంతో బాధ్యతతో కూడుకున్నది.. ఓం రౌత్ చాలా బాగా ఈ సినిమా కథను డిజైన్ చేశారని ప్రభాస్ తన ఇన్ స్టాగ్రాం ద్వారా చెప్పుకొచ్చాడు.
ఈ సినిమాను తెలుగు, హిందీతో పాటుగా తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో కూడా రిలీజ్ ప్లాన్ చేశారు. 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది. బాహుబలి తర్బాత ప్రభాస్ చేస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఇదే. సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడని తెలుతుంది. ఈ సినిమాతో పాటుగా నాగ్ అశ్విన్ డైరక్షన్ లో కూడా ప్రభాస్ ఓ భారీ మూవీ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.