
మళయాళ భామ నివేదా థామస్ జెంటిల్ మెన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత నిన్నుకోరితో మెప్పించింది. జై లవ కుశ, బ్రోచేవారెవరురా ఇలా కెరియర్ లో మంచి జోష్ కనబరుస్తున్న ఈ అమ్మడు ఇప్పుడు మరో క్రేజీ ఛాన్స్ పట్టేసిందని తెలుస్తుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరక్షన్ లో సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కే భారీ బడ్జెట్ సినిమాలో నివేదా థామస్ ను సెలెక్ట్ చేశారట. సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనె నటిస్తుంది.
మూవీలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో నివేదా కనిపిస్తుందని తెలుస్తుంది. ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ లో ఛాన్స్ రావడంతో తెగ సంబరపడుతుంది నివేదా థామస్. ఇదేకాదు సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమాలో కూడా నివెదా థామస్ కు ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఆ సినిమాలో కూడా కీర్తి సురేష్ ఒక హీరోయిన్ కాగా నివేదా థామస్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.