
సుధీర్ బాబు హీరోగా వచ్చిన నను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన నభా నటేష్ తన టాలెంట్ చూపించేసింది. పూరీ డైరక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ హిట్ తో అమ్మడు సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. వరుస అవకాశాలతో కెరియర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న నభా నటేష్ కు మరో లక్కీ ఛాన్స్ వచ్చింది. నితిన్ హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అందాదున్ రీమేక్ లో నభా నటేష్ కు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది.
ఇస్మార్ట్ హిట్ తో కెరియర్ లో జోష్ పెంచుకున నభా నటేష్ ఇప్పుడు నితిన్ సరసన కూడా ఛాన్స్ కొట్టేసింది. బాలీవుడ్ లో రాధికా ఆప్టే చేసిన ఈ పాత్రలో నభా నటేష్ నటిస్తుంది. ఇప్పటికే చేతిలో అరడజను సినిమాల దాక ఉన్న నభా నటేష్ వచ్చిన ప్రతి అవకాశాన్ని చేస్తుంది. తెలుగులో ఈమధ్య కాలంలో సక్సెస్ అయిన హీరోయిన్స్ లో నభా నటేష్ కూడా ఒకరు. మరి అందాదున్ రీమేక్ అమ్మడి కెరియర్ కు ఏమాత్రం హెల్ప్ అవుతుందో చూడాలి.