
అప్పుడెప్పుడో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రామాయణ్ అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి సర్ ప్రైజ్ చేశాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కే ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాతల భాగస్వామ్యంతో అల్లు అర్జున్ పెద్ద స్కెచ్ వేశారు. ఈ సినిమాలో రాముడు, రావణాసురుడు పాత్రల్లో స్టార్స్ నటిస్తారని అన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ టీ సీరీస్ చేతుల్లోకి వెళ్ళడం వారు రాముడిని సెలెక్ట్ చేయడం జరిగిందట.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించిన ఎనౌన్స్ మెంట్ ఈరోజు ప్రకటించనున్నారు. బాహుబలితో ప్రభాస్ నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. కొన్నాళ్ళుగా స్ట్రైట్ బాలీవుడ్ మూవీ ప్రయత్నాల్లో ఉన్న ప్రభాస్ టీ సీరీస్ తో చేతులు కలిపినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా గురించి సర్ ప్రైజ్ ఎనౌన్ మెంట్ ను డైరక్టర్ ఓం రౌత్ తో కలిసి ప్రభాస్ లైవ్ లోకి వస్తారని తెలుస్తుంది. మరి ప్రభాస్ చేసేది రాముడి పాత్రేనా.. ఈ ఎనౌన్స్ మెంట్ ఎలా ఉండబోతుంది అన్నది ప్రభాస్ ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతుంది.