
సినిమా దర్శకులంతా ఇప్పుడు వెబ్ సీరీస్ ల మీద దృష్టి పెట్టారు. కరోనా లాక్ డౌన్ లో డిజిటల్ ఫ్లాట్ ఫాం సక్సెస్ అయ్యింది. సినిమాలు, వెబ్ సీరీస్ లతో సిని ప్రియులను అలరిస్తున్నాయి. ఇక తెలుగు మేకర్స్ కూడా ఆడియెన్స్ కు కావల్సిన ఎంటర్టైన్మెంట్ ను వెబ్ సీరీస్, వెబ్ మూవీస్ ద్వారా అందిస్తున్నారు. ఈ క్రమంలో మాస్ డైరక్టర్ సంపత్ నంది కూడా ఓ క్రేజీ వెబ్ సీరీస్ ప్లాన్ చేశారు. బోల్డ్ అటెంప్ట్ తో వస్తున్న ఈ వెబ్ సీరీస్ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతెలాని సెలెక్ట్ చేశారు.
బీ టౌన్ లో తన అందచందాలతో కాకరేపుతున్న ఈ అమ్మడు ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ ముందుకు వస్తుంది. ఇప్పటికే అమ్మడి హాట్ ఫోటో షూట్స్ క్రేజీగా మారగా తెలుగులో అడల్ట్ వెబ్ సీరీస్ లో నటించడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ వెబ్ సీరీస్ కు బ్లాక్ రోస్ అనే టైటిల్ ఫిక్ చేశారు. శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో ఈ వెబ్ సీరీస్ వస్తుంది. బోల్డ్ కంటెంట్ కు ఎప్పుడైనా ఎక్కడైనా ప్రేక్షకాదరణ ఉంటుంది. వెబ్ సీరీస్ లపై ఇలాంటి కథలకు మంచి డిమాండ్ ఉంటుంది. మరి ఊర్వసి తెలుగులో చేస్తున్న మొదటి ప్రయత్నం ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.