వెంకటేష్ 75వ సినిమా.. రేసులో ముగ్గురు దర్శకులు..!

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం కెరియర్ లో 74వ సినిమా చేస్తున్నాడు. అసురన్ రీమేక్ గా నారప్ప టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను శ్రీంకాత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నారు. కరోనా వల్ల 2021 జనవరి వరకు ఈ సినిమా షూటింగ్ వాయ్దా పడినట్టు తెలుస్తుంది. ఇక ఇదిలాఉంటే ఈ సినిమా తర్వాత వెంకటేష్ చేసే సినిమాపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. వెంకటేష్ 75వ సినిమాగా క్రేజీ కాంబినేషన్ ను సెట్ చేసే పనిలో పడ్డారు.

వెంకటేష్ 75వ సినిమా సురేష్ ప్రొడక్షన్ లోనే చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం దర్శకుల రేసులో ముగ్గురు ఉన్నట్టు తెలుస్తుంది. అందులో త్రివిక్రం, పూరీ జగన్నాథ్, కిశోర్ తిరుమల లిస్ట్ లో ఉన్నారట. రైటర్ గా ఉన్నప్పుడు వెంకటేష్ తో సినిమాలు చేసిన త్రివిక్రం డైరక్టర్ గా మారిన తర్వాత మాత్రం ఒక్క సినిమా చేయలేదు. ఇక పూరీ జగన్నాథ్ కూడా వెంకీతో సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు. కిశోర్ తిరుమల కూడా వెంకటేష్ కోసం కథ సిద్ధం చేశాడట. ఈ ముగ్గురు దర్శకుల్లో ఒకరితో వెంకటేష్ 75వ సినిమా ఉంటుందని తెలుస్తుంది. వెంకటేష్ ల్యాండ్ మార్క్ మూవీ ఎవరు డైరెక్ట్ చేస్తారో త్వరలో తెలుస్తుంది.