
టాలీవుడ్ మినిమం గ్యారెంటీ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న మారుతి లాస్ట్ ఇయర్ ప్రతిరోజూ పండుగె సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత మాస్ మహరాజ్ రవితేజ కోసం కథ సిద్ధం చేశాడట మారుతి. త్వరలోనే తన నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా వెబ్ సీరీస్ కూడా చేస్తున్నాడు మారుతి. మారుతి నిర్మిస్తున్న ఈ వెబ్ సీరీస్ కు 3 రోజెస్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. మ్యాగీ డైరక్షన్ లో వస్తున్న ఈ వెబ్ సీరీస్ లో రెజినా, ప్రగ్యా జైశ్వాల్, పూర్ణలు నటిస్తారని తెలుస్తుంది.
కెరియర్ లో వెనకపడ్డ ఈ ముగ్గురు హీరోయిన్స్ ను సెలెక్ట్ చేసి 3 రోజెస్ అంటూ ఓ బోల్డ్ వెబ్ సీరీస్ ప్లాన్ చేశాడు మారుతి. కెరియర్ మొదట్లో ఈరోజుల్లో, బస్టాప్ లాంటి అడల్ట్ కామెడీ సినిమాలతో హిట్ అందుకున్న మారుతి మరోసారి వెబ్ సీరీస్ కోసం అడల్ట్ సబ్జెక్ట్ తో వస్తున్నాడు. ఓ పక్క సినిమాలు చేస్తూనే వెబ్ సీరీస్ లకు కథ అందించడంతో పాటుగా నిర్మాతగా కూడా కొనసాగుతున్నాడు మారుతి.