
కలక్షన్ కింగ్ మోహన్ బాబు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తన కొత్త సినిమా ప్రకటనతో అందరికి సర్ ప్రైజ్ ఇచ్చారు. సన్ ఆఫ్ ఇండియా అంటూ అదిరిపోయే పోస్టర్ తో మోహన్ బాబు వచ్చారు. డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పోస్టర్ తో అంచనాలు పెంచారు. 2018లో వచ్చిన గాయత్రి తర్వాత మోహన్ బాబు సినిమాలు చేయడంలో వెనక్కి తగ్గారు. అదే సంవత్సరంలో వచ్చిన మహానటి సినిమాలో ఎస్వి రంగారావు పాత్రలో మెప్పించారు.
ప్రస్తుతం సూర్య నటిస్తున్న సూరరై పోట్రు సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు మోహన్ బాబు. సుధ కొంగర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో మళ్ళీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నారు కలక్షన్ కింగ్. ఇక లేటెస్ట్ గా సన్ ఆఫ్ ఇండియా సినిమా ఎనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. తన కెరియర్ లో అసెంబ్లీ రౌడీ, మేజర్ చంద్రకాంత్, పెదరాయుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న మోహన్ బాబు మళ్ళీ తన మార్క్ చూపించేందుకు సన్ ఆఫ్ ఇండియాతో వస్తున్నారు.