గుడ్ లక్ సఖి టీజర్.. కీర్తి సురేష్ మరో అద్భుత ప్రదర్శన..!

మళయాళ భామ కీర్తి సురేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుడ్ లక్ సఖి. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ లో సుధీర్ చంద్ర నిర్మిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో వస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. గిరిజన యువతి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది. 

టీజర్ తో ఇంప్రెస్ చేసిన గుడ్ లక్ సఖి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సినిమాలో కీర్తి సురేష్ మరోసారి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకునేలా ఉంది. మహానటి సినిమాతో ఉత్తమ నటిగా బెస్ట్ అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి సినిమాలో కూడా తన అభినయంతో అలరించేలా ఉంది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడం విశేషం. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిజిటల్ రిలీజ్ ప్లాన్ చేస్తారని టాక్.