
తనకు కరోనా వచ్చిందని వీడియో ద్వారా మెసేజ్ పంపించి త్వరలోనే కోలుకుంటా అని చెప్పిన లెజెండరీ సింగర్ బాల సుబ్రహ్మణ్యం క్యాజువాలిటీ నుండి ఐసియుకి షిఫ్ట్ అయినట్టు సమాచారం. ఆగష్టు 5 న ఎం.జి.ఎం హాస్పిటల్ లో జాయిన్ అయిన బాలు చికిత్స తీసుకుంటున్నారు. ఆగష్టు 13 అర్ధ రాత్రి బాలు ఆరోగ్యం క్షీణించిందని MGM హాస్పిటల్ హెల్త్ బులిటెన్ లో వెళ్లడించారు.
డాక్టర్స్ సూచలన మేరకు బాల సుబ్రహ్మణ్యం ను ఐసియుకి షిఫ్ట్ చేసి, లైఫ్ సపోర్ట్ సిస్టెంతో ట్రీట్ మెంట్ చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్రిటికల్ గానే ఉందని డాక్టర్స్ రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్ ద్వారా తెలుస్తుంది. స్పెషలిస్ట్ డాక్టర్స్ అంతా బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారని తెలిపారు.