
మాస్ మహరాజ్ రవితేజ హిట్టు కోసం తపించిపోతున్నాడు రాజా ది గ్రేట్ తర్వాత చేసిన నాలుగు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం గోపిచంద్ మలినేని డైరక్షన్ లో క్రాక్ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో రవితేజ కనిపిస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా ఓటిటి రిలీజ్ అవుతుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలపై స్పందించిన డైరక్టర్ గోపిచంద్ మలినేని క్రాక్ థియేటర్లోనే రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ అయ్యేందుకు టైం పట్టేలా ఉన్నా ఎప్పుడు థియేటర్లు ఓపెన్ చేస్తే అప్పుడే ఈ సినిమా రిలీజ్ ఉంటుందని చెబుతున్నారు. టీజర్ తో మెప్పించిన క్రాక్ సినిమాతో ఎలాగినా హిట్టు కొట్టాలని ఫిక్స్ అయ్యాడు రవితేజ. ఇటు డైరక్టర్ గోపిచంద్ కు ఇది ప్రెస్టిజియస్ మూవీగా మారింది.