ప్రశాంత్ నీల్ కోసం రెండేళ్ళా..?

R.R.R తర్వాత ఎన్.టి.ఆర్ ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాను భారీ రేంజ్ లో తెరకెక్కిస్తారని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ రెండేళ్ళు టైం అడుగుతున్నాడని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ కోసం ఆల్రెడీ రెండేళ్ళు టైం ఇవ్వగా తారక్ కూడా ఈ సినిమాకు రెండేళ్ళు డేట్స్ ఇస్తున్నాడని తెలుస్తుంది. 

ప్రశాంత్ నీల్ సినిమాను కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమా కథ కూడా కె.జి.ఎఫ్ రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మరి ఈ కాంబో సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.