వైష్ణవ్ తేజ్ తో క్రిష్..!

మెగా ఫ్యామిలీ నుండి రాబోతున్న మరో హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన రిలీజ్ అవకుండానే మరో క్రేజీ ప్రాజెక్ట్ కు రంగం సిద్ధమైంది. మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ఉప్పెన రిలీజ్ కు సిద్ధంగా ఉంది. బుచ్చిబాబు డైరక్షన్ లో తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ కు ముందే సూపర్ బజ్ ఏర్పరచుకుంది. ఇక ఈ సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ తన నెక్స్ట్ సినిమా క్రిష్ తో పనిచేస్తున్నాడని తెలుస్తుంది.    

క్రిష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ తో క్రిష్ మూవీ అనగానే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడతాయి. ఈ సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రేపు అనగా ఆగష్టు 15న వస్తుందని తెలుస్తుంది.